ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ కొజ్జా : ఎమ్మెల్సీ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఓ నపుంసకుడు అని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఓ నపుంసకుడు అని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బలరాం వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గొట్టిపాటిపై నిప్పులు చెరిగారు. గత 10 రోజుల నుంచి ఆయన చేస్తున్న చేష్టల ఫలితమే ఇదని మండిపడ్డారు. గొట్టిపాటి ఓ నపుంసకుడు అని అన్నారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు.