సోమవారం, 10 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (13:45 IST)

టీడీపీ నేత జేబులోని సెల్‌ఫోన్ బ్లాస్ట్...

తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత షర్ట్ ప్యాకెట్‌లో మొబైల్ ఫోన్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మండల కన్వీనర్‌ చలపతి తన మొబై

తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత షర్ట్ ప్యాకెట్‌లో మొబైల్ ఫోన్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మండల కన్వీనర్‌ చలపతి తన మొబైల్ ఫోనును షర్ట్ ప్యాకెట్‌లో ఉంచుకున్నాడు. ఇది సోమవారం అకస్మాత్తుగా పేలిపోయింది. చిన్నపాటి మంటతో కూడిన శబ్దం రావడంతో ఆయన సెల్‌ఫోన్‌ను బయటకు విసిరేశాడు. 
 
ఈ ఘటనలో చొక్కా స్వల్పంగా కాలిపోయి సెల్‌ఫోన్‌ పూర్తిగా దగ్ధమైంది. గతయేడాది బళ్లారిలోని సెల్‌ఫోన్‌ షోరూంలో కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన కుమారుడు దీన్ని వాడేవాడు. కాగా ఇటీవల కొడుకు కొత్త ఫోన్‌ కొనుక్కుని పాతదాన్ని తండ్రి చలపతికి ఇచ్చాడు. అప్పటి నుంచి ఇబ్బంది లేకుండా వాడుతున్న సెల్‌ఫోన్ సోమవారం ఒక్కసారిగా పేలిపోయిందని చలపతి చెప్పుకొచ్చాడు.