సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (12:32 IST)

మోడీ కూడా మూడో కుమారుడే.. మరి ఓటు సంగతేంటి? అసదుద్దీన్

దేశంలో జనాభా (ప్రత్యేకంగా ముస్లిం జనాభా) విపరీతంగా పెరిగిపోతోందని, ఈ జనాభా పెరుగదలను అరికట్టాలంటూ ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 
 
జనాభా పెరుగుదలపై రాందేవ్ బాబా స్పందిస్తూ, జనాభా పెరుగుదలను అరికట్టాలంటే ఇద్దరికి మించి పిల్లలు కనకుండా చట్టం తీసుకునిరావాలని కోరారు. ఆ చట్టాన్ని అతిక్రమించి ముగ్గురు పిల్లలు కంటే మాత్రం అతని ఓటు హక్కు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు లేకుండా చేయాలని రాందేవ్ సూచించారు. 
 
దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ, కొందరు వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను నిలువరించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. కానీ రాందేవ్ బాబా వ్యాఖ్యలకు ఇంత ప్రాధాన్యమా? ఆయన పొట్టను, కాళ్ళను కదిలిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు.
 
అంతేకానీ మూడో బిడ్డ పుట్టకూడదంటూ చెప్పడానికి ఆయన ఎవరు ఎని ప్రశ్నించారు. రాందేవ్ లెక్కన చూసుకుంటే... నరేంద్ర మోడీ కూడా మూడో కుమారుడే అని, మరి ఆయన తన ఓటు హక్కును కోల్పోవాలా? అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు.