శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జులై 2019 (16:13 IST)

నా కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నా... మోహన్‌బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.
 
ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీ విజయం కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రచారం జరుగుతోంది.