సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)

మోకాళ్ల పర్వతం ఎక్కి మరీ ప్రార్థించా... టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబీకులకిచ్చేయ్: మోత్కుపల్లి

చంద్రబాబు రాజకీయంగా పతనం కావాలని మెట్లెక్కుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి  నరసింహులు. శ్రీనివాసుడు తన మొర ఆలకించారని, అందుకే టిడిపి ఘోరంగా ఓడిపోయిందన్నారు. టిడిపి ఘోరంగా ఓడిపోతే చంద్రబాబు సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు అప్పజెప్పాలనన్నారు. 
 
చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, దళితులు, బలహీనవర్గాలు, కాపుల మధ్య చిచ్చు  పెట్టారన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి చంద్రబాబు ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ విజయం చారిత్రాత్మకమన్నారు మోత్కుపల్లి నరసింహులు. పేదల పక్షపాతి జగన్ అని.. పేద ప్రజల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు.