సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (08:37 IST)

జగన్ మరో వైఎస్ఆర్ అవుతారు : గాలి జనార్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించడం పట్ల కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసి, కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మ్రొక్కులు తీర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్‌ను మించిపోతారని జోస్యం చెప్పారు. 
 
ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.