శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (08:56 IST)

దుష్టసామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఏదో ఒకటి చేయాలి కదా: స్వరూపానందేంద్ర స్వామి

ఒక దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని, అలాంటిదే జగన్ - కేసీఆర్ కలయిక అని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఆయన తాజా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, జగన్ - కేసీఆర్ కలవడానికి ప్రత్యేక కారణం అంటూ తాను ఏమీ చెప్పలేనన్నారు. కానీ, ఓ దుష్టశక్తిని సాగనంపడానికి వీరిద్దరి కలయిక తోడ్పడిందని చెప్పగలనన్నారు. 
 
ఇకపోతే, ప్రజలకు తన తండ్రి వైఎఎస్ఆర్ చేసినదానికంటే ఇంకా ఏదో చేయాలన్న కసితో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారనీ విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
దీనిపై స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, వైఎస్ఆర్ తనకు ఎంతో అభిమానమన్నారు. ఆయన కూడా తన పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేదలకు చేరువయ్యాడని చెప్పారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ఉండేదన్నారు. 
 
ఇపుడు ఆ తపన, కసి జగన్ మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, సమాజంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న పరితపించి పోతున్నాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందే..అంతకు మించిన స్థాయిలో తాను పేరు సంపాదించుకోవాలని జగన్ ఉవ్విళ్ళూరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కంటే జగన్ మంచి సుపరిపాలన అందిస్తారని స్వామి అభిప్రాయపడ్డారు.