మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:52 IST)

తిరుపతి నుంచి ప్ర‌ధాన న‌గ‌రాల‌కు విమాన సర్వీసులు పెంచాలి

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు విమాన సర్వీసుల సంఖ్య పెంచాలని ఎం పి  తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సలహా కమిటి ఛైర్మన్ మద్దిల గురుమూర్తి  విమాన సర్వీసుల ఆపరేటర్ల కు సూచించారు. తిరుపతి విమానాశ్రయం లో నిర్వహించిన సలహా కమిటికి ఛైర్మన్ హోదాలో అధ్యక్షత వహించారు.
 
సమావేశంలో తొలుత ఎయిపోర్టు డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ, సలహా కమిటీ సమావేశానికి ఛైర్మన్ హోదాలో హాజరైన ఎం పి గురుమూర్తి కి  స్వాగతం పలికి పుష్ప గుచ్ఛం అందజేశారు. తిరుపతి విమానాశ్రయం అభివృద్ది, ప్రయాణికులు సౌకర్యాలు కల్పన, పెండింగులో ఉన్న అభివృద్ధి పనుల వివరాల ను గంట పాటు పవర్ పాయింట్  ప్రెసెంటషన్ ద్వారా సలహా కమిటీ కి వివరించారు. తిరుమల ల్లో విమాన సర్వీసులు వివరాలు తెలుపుతూ డిజిటల్ బోర్డ్ పెట్టేందుకు టీటీడీ సహకారం కోరతామన్నారు. 
 
ఈ సందర్భంగా ఎం పి గురుమూర్తి మాట్లాడుతూ, పుణ్యక్షేత్రాలు మధురై, వారణాశిలతో పాటు చెన్నయ్, అహ్మదాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి లకు విమాన సర్వీసులు అందుబాటులో కి తేవాలన్నారు.  ప్రయాణికులకు హోటల్ బుకింగ్, టిటిడి దర్శనం బుకింగ్ సౌకర్యాలు ఎయిర్పోర్ట్ లో కౌంటర్ లు పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. బోయింగ్ విమానాలు దిగేందుకు ఉన్న సాంకేతిక అడ్డంకులు పరిష్కారం చేసి రన్ వే విస్తరణ కు చర్యలు తీసుకోవాలని ఎయిర్ పోర్ట్ అధికారుల‌కు సూచించారు.  ప్రయాణికుల సంఖ్య పెంచే విధంగా వివిధ ఎయిర్లైన్ ఆపరేటర్లు విమాన సర్వీసులు సంఖ్య పెంచాలన్నారు. అలాగే ఎయిర్పోట్ నుంచి శ్రీకాళహస్తి హైవే వరకు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు కు ఆర్ అండ్ బి, తుడ అధికారుల తో మాట్లాడుతామని చెప్పారు.
 
సమావేశంలో సలహా కమిటీ సభ్యులు ఓడురు గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక శ్రీకాళహస్తి, మాధవ మాల చేతివృత్తుల కళాకారుల కళానైపుణ్యం తెలిసే విధంగా కలంకారి , చెక్క బొమ్మల విక్రయానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎయిర్లైన్ ఆపరేటర్లు మాట్లాడుతూ, వచ్చే నెల నుంచి విజయవాడ, రాజమండ్రి, తమిళనాడు మదురై లకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ లు ప్రారంభిస్తామని తెలిపారు. 
 
ఈ సమావేశంలో తిరుపతి ఎయిర్పోట్ అన్నివిభాగల అధికారులు, ఇండిగో, ఇండియన్ ఎయిర్ లైన్స్, స్పైస్, జెట్,  స్టార్ ఎయిర్ విమాన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.