సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (15:02 IST)

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విటుడి కోసం వచ్చి బుక్కైంది...

ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన ఓ కాల్ గర్ల్‌ను విజయవాడకు చెందిన హనుమా నాయక్ అనే వ్యక్తి ఆన్‌లైన్ మాధ్యమంగా బుక్ చేసుకున్నాడు. ఆపై ఆమె ఖాతాకు డబ్బు పంపించడంతో ఆమె అతనికి సుఖం అందించేందుకు విజయవాడకు వచ్చింది. 
 
హనుమా నాయక్ సూచనల మేరకు ఆమె పటమటలో ఉన్న ఓ హోటల్లో మకాం వేయగా, ఆమె ప్రవర్తనతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
ప్రస్తుతం కాల్‌గర్ల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హనుమా నాయక్ ఎవరన్న విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఎవరో తనకు తెలియదని, చూడలేదని ఆమె చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా అతన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.