1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 31 జులై 2021 (13:42 IST)

నా భర్త అందంగా లేడు, చంపేస్తున్నా: ప్రియుడితో వివాహిత

పెళ్ళయి 15 సంవత్సరాలవుతోంది. ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న కుటుంబం. పిల్లలు పెద్దవారవుతున్నారు. అయితే అదంతా ఏం పట్టించుకోని ఒక వివాహిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అందంగా లేడని.. బోరు కొట్టేస్తున్నాడని అతడిని అతి కిరాతకంగా చంపేసింది. 
 
చిత్తూరు లోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాజు, స్వప్నప్రియలకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. గాంధీ రోడ్డులో ప్రొవిజన్ స్టోర్‌ను నడుపుతున్నాడు రాజు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే గత రెండునెలలుగా స్వప్నప్రియ తన ఇంటి దగ్గరలోని ఒక యువకుడితో సన్నిహితంగా ఉంటోంది.
 
అతనితో శారీరకంగా కలుస్తోంది. వివాహేతర సంబంధం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. కానీ తన కుటుంబం కన్నా ప్రియుడే ఎక్కువగా భావించింది. నాకు నా భర్త అంటే ఇష్టం లేదు. నేను నీతో వచ్చేస్తాను. మనిద్దరమే కలిసి ఉందాం.. పిల్లలు కూడా వద్దని ప్రియుడికి చెప్పింది.
 
సరేనన్నాడు ప్రియుడు. అంతటితో ఆగలేదు. నా భర్తను నేను చంపేస్తానని చెప్పింది. ఎలా చంపాలో ప్రియుడు ప్లాన్ ఇచ్చాడు. అనుకున్న విధంగా అతి దారుణంగా చంపేసింది స్వప్నప్రియ. నిద్రిస్తున్న భర్తను దిండుతో అదిమిపెట్టి గొంతు నులిమి చంపింది.
 
ఆ తరువాత సాధారణ మరణంగా బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ బంధువులకు అనుమానం రావడం పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం బయటపడింది. స్వప్నప్రియను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో ప్రియుడితో పాటు స్వప్నప్రియను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.