ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (13:13 IST)

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి జనసేనలోకి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ ఉప సభాపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పార్టీ మారనున్నారు. ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం స్పష్టం చేశారు.
 
గురువారం సాయంత్రం మనోహర్‌ తిరుమలకు వెళ్లనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం గురువారం రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
కాగా, కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఖచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.