సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (16:52 IST)

సమంతతో వైవాహిక బంధాన్ని ముగిస్తున్నా: నాగచైతన్య ప్రకటన

టాలీవుడ్ లో అందమైన జోడీగా పేరుపొందిన నాగచైతన్య, సమంతలు విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఇప్పుడదే నిజమైంది. సమంతతో తన వైవాహిక బంధాన్ని ముగిస్తున్నానని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సామ్ తో విడిపోతున్నానని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.
 
చాలా చర్చలు, ఆలోచనల తర్వాత భార్యాభర్తలుగా కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. దశాబ్దకాలానికి పైగా స్నేహబంధాన్ని కలిగివుండడం అదృష్టంగా భావిస్తామని, తమ అనుబంధానికి అదే ప్రాతిపదిక అని నాగచైతన్య వివరించారు. ఈ కష్టకాలంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు తమకు మద్దతుగా నిలవాలని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మీ తోడ్పాటుకు ధన్యవాదాలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.