1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (16:00 IST)

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జున సమావేశం, మధ్యాహ్నం భోజనం చేస్తూ...

ఏపీ జగన్‌ మోహన్ రెడ్డితో కింగ్ నాగార్జున సమావేశమయ్యారు. గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసారు నాగ్. నాగ్ వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు వున్నారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం గురించి సమావేశంలో చర్చించినట్లు సమచారం.
 
కాగా మధ్యాహ్న భోజనం సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి చేసారు నాగార్జున. ఐతే వీరిద్దరి మధ్య ఏయే విషయాలపైన చర్చలు జరిగాయన్నది తెలియాల్సి వుంది.