శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

నేడు గజల్ శ్రీనివాస్ బెయిల్‌పై తీర్పు

'ఆలయవాణి' వెబ్ రేడియోలో పని చేసే ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ జరుపనుంది.

'ఆలయవాణి' వెబ్ రేడియోలో పని చేసే ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ జరుపనుంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న గజల్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. 
 
మరోవైపు, గజల్‌కు బెయిల్‌ ఇవ్వవద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని, ఇప్పట్లో బెయిల్‌ దొరికితే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. 
 
ముఖ్యంగా, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. పరారీలో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
గజల్ శ్రీనివాస్ ఇద్దరు మహిళలతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా, తన ఇంటి పనిమనిషి పార్వతితో శృంగారం, ఓరల్ సెక్స్ చేయించుకునే వీడియో క్లిప్పింగ్స్ లీక్ అయిన విషయం తెల్సిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి.