బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (17:34 IST)

యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే అర్థరాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్.. కోర్టుకు హాజరయ్యాడు. విచారణ అనంతరం ప్రదీప్ డ్రైవింగ్

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే అర్థరాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్.. కోర్టుకు హాజరయ్యాడు. విచారణ అనంతరం ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు రూ.2,100 జరిమానా కూడా విధించింది. 
 
డ్రంకెన్ డ్రైవ్‌కు నిరసనగా మీడియాలో ప్రచారం చేసే మీరే మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా అంటూ కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ లేకపోవడంతోనే తాను కారును నడపాల్సి వచ్చిందని ప్రదీప్ వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. మరోసారి ఇలాంటి తప్పు చేయనని యాంకర్ ప్రదీప్ విజ్ఞప్తి చేశాడు. 
 
ఇకపోతే.. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన సమయంలో బ్రీత్ అనలైజర్‌లో 178 పాయింట్లు చూపించింది. అత్యధికంగా మద్యం తాగితేనే అన్ని పాయింట్లు నమోదు అవుతాయి. ఈ కేసులో ఇప్పటికే కౌన్సెలింగ్‌కు కూడా ప్రదీప్ హాజరయ్యాడు.