శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (10:01 IST)

నిజం మాట్లాడుతాను కాబట్టే నన్ను వెనక్కి నెట్టారు.. ఎన్నో దెబ్బలు తగిలాయ్: హరికృష్ణ

కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డును ప్రారంభించాల్సిందిగా హరికృష్ణను గ్రామస్థులు ఆహ్వానించారు. వారి కోరికపై అక్కడకు చేరుకున్న హరికృష్ణకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎద్దుల బండిపై ఊరేగించారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తగిలాయన్నారు. 
 
అయినా కూడా సత్యాన్ని ఎత్తిచూపడంతో పాటు నిజాన్ని కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తండ్రిని హరికృష్ణ స్మరించుకున్నారు. తెలుగు వాడికి ఒక గొప్ప గౌరవం తీసుకువచ్చిన నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.