శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:31 IST)

నారా భువనేశ్వరి ఆదేశంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు : సోమినాయుడు

బెజవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశం మేరకు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపించారు. ఆమె ఆదేశం మేరకు అప్పటి ఈవో ఈ పూజలు అర్థరాత్రి నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అపుడు దేవాదాయ శాఖామంత్రిని మంత్రిని రాజీనామా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించిందా? అని ప్రశ్నించారు. కాగా, తన కుమారుడైన నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబాబు నాయుడు ఈ తాంత్రిక పూజలు నిర్వహించారంటూ వైకాపా గతంలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
కాగా, ఇపుడు దుర్గగుడి రథానికి ఉన్న మూడు సింహాలు మాయమయ్యాయి. ఈ వ్యవహారం ఏపీలో పెను రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఈ సింహాలు మాయం కావడం వెనుక వైకాపా నేతలు హస్తంవుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోమి నాయుడు కౌంటరిచ్చారు.