శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (13:55 IST)

సాక్షి టీవీకి లోకేష్ రిప్లయ్!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీకి టీడీపీ యువనేత నారా లోకేష్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనారంటూ సాక్షి టీవీలో ప్రసారం కావడం లోకేశ్ దృష్టికి రావడంతో సదరు మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆ విషయంపై చర్చించిన లోకేష్.. ఆయనతో ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. 
 
‘అవును నిజమే.. గంటా శ్రీనివాసరావుగారి ముఖంలో అలక చూడండి.’ అంటూ ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేసారు. ‘అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. ఫేక్‌ న్యూస్ సాక్షి, ఫేక్ టీవీ, ఫేక్ లీడర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను కూడా జత చేసారు.