శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (02:20 IST)

నాన్న అవకాశం ఇవ్వాలే కానీ ఎమ్మెల్సీ ఏంటి ఖర్మ సర్పంచ్‌గానూ పనిచేయనా: ఔరా లోకేష్ బాబూ

నాన్న అవకాశం ఇవ్వాలే కానీ ఎమ్మెల్సీ ఏంటి ఖర్మ సర్పంచ్‌గానూ పనిచేయనా అంటున్న నారా లోకేశ్ బాబు నిజంగానే నమ్రతగా అంటున్నారా లేక ఆ పోస్టుకు ఎలాగూ తనను ఎంపిక చేయరులే అనే గుండెధైర్యంతో ఆ మాట అనేశారా.. అనేది టీడీపీ వర్గాలకే అర్థం కావడం లేదు. చెప్పడం వరకూ అయ

నాన్న అవకాశం ఇవ్వాలే కానీ ఎమ్మెల్సీ ఏంటి ఖర్మ సర్పంచ్‌గానూ పనిచేయనా అంటున్న నారా లోకేశ్ బాబు నిజంగానే నమ్రతగా అంటున్నారా లేక ఆ పోస్టుకు ఎలాగూ తనను ఎంపిక చేయరులే అనే గుండెధైర్యంతో ఆ మాట అనేశారా.. అనేది టీడీపీ వర్గాలకే అర్థం కావడం లేదు. చెప్పడం వరకూ అయతే లోకేశ్ రెండు మంచి మార్కులు కొట్టేశారు. సర్పంచ్ పదవిలో కూర్చోవడనానికైనా సిద్ధమే అనేది ఒకటి. ఇక రెండోది ఇంకొకరిని రాజీనామా చేయించి తాను పోటీ చేయాలనుకోవడం లేదనటం. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. 
 
తెలుగు దేశం పార్టీలో ప్రస్తుతం నంబర్ టూగా తిరుగులేని అధికారం చలాయిస్తున్న నారా లోకేశ్ ఇంత వినయంగా మాట్లాడుతున్నాడేంటీ అని జనం భావించడమే కదా తనకూ, తన తండ్రి చంద్రబాబుకూ కావలసింది. ఆవిధంగా ఆరంగేట్రం అద్భుతంగా ముగించారు లోకేశ్. 
 
కానీ నిరుద్యోగ భృతి హామీ ఇవ్వడం వాస్తవమేనని అయిదేళ్లలో దాన్ని అమలు చేస్తామని చెప్పిన లేకేశ్. తాను తండ్రి ఆలోచనలకు ఎంత దగ్గరగా ఉన్నాడో అందరకీ చూపించేశారు. మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికీ భృతి ఇవ్వలేకపోయిన టీడీపీ ప్రభుత్వం మిగిలిన రెండేళ్లలో ఎలా ఇస్తుందోనని నివ్వెర పోవడం తెలుగు తమ్ముళ్ల వంతయింది.
 
సోమవారం  టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృజ్ఞతలు చెప్పారు. పార్టీ నేతలతో కలసి లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకొకరిని రాజీనామా చేయించి పోటీ చేయాలనుకోవడం లేదని అన్నారు. తాను పోటీ చేయాలా లేదా అన్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 
 
నిరుద్యోగ భృతి హామీ ఇచ్చామని, ఐదేళ్లలో అమలు చేస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, ఇంకా రెండేళ్లు మిగిలి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనను సర్పంచ్‌గా ఉండమని టీడీపీ అధ్యక్షుడు చెబితే అదే చేస్తానని నారా లోకేష్‌ అన్నారు.