ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (12:53 IST)

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాజోలు నుంచి ప్రారంభం

yuvagalam
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి పునః ప్రారంభం కానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్‌తో సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సోమవారం యాత్ర ప్రారంభం కానుంది.
 
రాజోలు,పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువ గళం పాదయాత్ర కొనసాగనుంది.