1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (12:21 IST)

అది తెలియకుండా ఉంటే ఎలా బేబీ.. నారా లోకేష్‌పై సెటైర్ వేసిన ఆర్జీవీ

Ram Gopal Varma
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకొని ఆనందపడిన విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేత నారా లోకేష్ స్పందిస్తూ.. ఆయన సమాజానికి ఏం మంచి పనిచేశాడు? అని అన్నాడు. అలాగే వ్యూహం సినిమా ద్వారా ఏం సాధించాలని అనుకొంటున్నాడు అంటూ కామెంట్ చేశాడు. దానికి ఆర్జీవి కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. 
 
"లోకేష్.. నాకు నిన్ను చూసి జాలి పడాలా? నవ్వాలా? ఏడ్వాలా? అనే విషయం తెలియడం లేదు. నేను రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం పడుతాను. నేను ఏం చేయాలి? నేను ఫిలిం మేకర్‌ను. నేను నీలాగా ప్రజా సేవ చేస్తానని చెప్పానా? అంటూ ఫైర్ అయ్యాడు. 
 
నీ స్థానంలో నేనుంటే.. వాడు పిచ్చి నా కొడుకు. పిచ్చి సినిమాలు చేస్తాడు. అడ్డదిడ్డంగా ట్వీట్లు పెడుతాడు. అలాంటోడికి నేను జవాబు ఇవ్వాలా? అని చెప్పొచ్చు కదా.. అంతకంటే.. వాడు పొద్దున్న లేచి పోర్న్ చూస్తాడు. బాధ్యతలేని వ్యక్తి అని చెప్పొచ్చుగా. ఆ మాత్రం తెలియకుండా ఉంటే ఎలా బేబీ" అంటూ సెటైర్ వేశాడు.