మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (12:52 IST)

తెలుగుదేశం పార్టీకి అవసరమైతే సేవలందిస్తా: నారా రోహిత్

సినీ హీరో, ఇటీవల రిలీజ్ అయిన రౌడీ ఫెల్లో కథానాయకుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి తన సేవలు అవసరం అనుకున్నప్పుడు అందిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు తనయుడు, ప్రముఖ తెలుగు హీరో నారా రోహిత్ ఆదివారం చెప్పారు. 
 
ఆదివారం నారా రోహిత్ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను సినిమాల్లో నటించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రౌడీ ఫెలో చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీకీ తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానన్నారు.