1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (17:21 IST)

చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డుపై ప్రమాదం.. పెద్దిరెడ్డికి - మిథున్ రెడ్డి జస్ట్ ఎస్కేప్

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. 
 
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి కుటుంబ సభ్యులు పుంగనూరు నుంచి వీర్బల్లిలోని అత్తగారింటికి సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఎంపీ మిథున్‌కు చెందిన గన్‌మ్యాన్, డ్రైవర్ గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.