బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:21 IST)

నయీమ్ కేసు.. అనుచరులందరూ గన్‌లను సరెండర్ చేయండి.. తెలంగాణ సర్కారు ఆర్డర్

నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు పోలీసులకి చాలా విషయాలు బయటపడుతున్నాయి. నయీమ్ చేసిన హత్యల్లో ఎక్కువగా రియల్ మర్డర్స్‌తో పాటు రైవలరీ మర్డర్సే ఉన్నట్టు తేలినట్టు తెలుస్తోంది.

నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు పోలీసులకి చాలా విషయాలు బయటపడుతున్నాయి. నయీమ్ చేసిన హత్యల్లో ఎక్కువగా రియల్ మర్డర్స్‌తో పాటు రైవలరీ మర్డర్సే ఉన్నట్టు తేలినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 24 మంది నయీమ్ చేతిలో చనిపోయిన వారి డేటాను సేకరించారు పోలీసులు. నయీమ్ అండ్ గ్యాంగ్ చేతిలో హతమైన వాళ్ల చిట్టాని విప్పడంతో పాటు ఆ హత్యలన్నీ ఎఫ్ఐఆర్‌లు అయ్యాయా లేదా మిస్సింగ్ కేసులుగా ఉన్నాయా.. ఉంటే అప్పటి దర్యాప్తు అధికారులు ఏం చేశారు. 
 
ఈ హత్యలు ఫోకస్ కాకుండా పోలీసులేమైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ పోలీసులు. నయీమ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. నయీమ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దర్యాప్తు చేస్తుండటంతో అనేక మంది పోలీసు అధికారులకు, మాజీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఘడియలు మొదలయ్యాయి. 
 
అందుకు నయీమ్ డైరీలే దోహదం చేస్తున్నాయి. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీమ్‌తో సంబంధాలున్న వ్యక్తులు తమ వద్ద ఉన్న గన్‌లను సరెండర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గన్‌లు సరెండర్ చేయాల్సిన వారిలో అధికార, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు సమాచారం. వారి గన్ లైసెన్స్‌లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నయీమ్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేసినట్లు సమాచారం.