శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (12:08 IST)

బాబా అవతారం ఎత్తిన టీచర్.. పది కోట్లు సంపాదించాడు.. చివరకి?

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వుండి బోర్ కొట్టేసింది. డబ్బు సంపాదించాలనుకున్నాడు. డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అంతే బాబా అవతారం ఎత్తాడు. ఈ బాబా అవతారంలో ఏకంగా పది కోట్లకు పైగా సంపాదించాడు

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వుండి బోర్ కొట్టేసింది. డబ్బు సంపాదించాలనుకున్నాడు. డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అంతే బాబా అవతారం ఎత్తాడు. ఈ బాబా అవతారంలో ఏకంగా పది కోట్లకు పైగా సంపాదించాడు. ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వున్న వ్యక్తి బాబాగా అవతారం ఎత్తి కోట్లు సంపాదించిన ఘటన ఎక్కడో కాదు.. నెల్లూరులోనే చోటుచేసుకుంది.
 
అయితే అతనో దొంగ బాబా అని ప్రజలకు తెలియడంతో ఆత్మాహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ప్రశాంతినగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సుధాకర్ అనే వ్యక్తి బాబాగా మారాడు. ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలే పెట్టుబడిగా, బాబాలపై భక్తులకు ఉన్న నమ్మకమే ఆసరాగా మహారాజ్ బాబాపేరుతో ప్రజలను నమ్మించాడు. 
 
ఎందరో ప్రముఖులు ఈ బాబా వద్దకు వచ్చారు. ఈ క్రమంలో 103 రోజుల హోమం చేస్తే మంచి జరుగుతుందనే పేరుతో భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రారంభించాడు. పదికోట్ల రూపాయలు వసూలు చేసిన బాబా ఆ డబ్బును తరలించేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లానే బెడసికొట్టింది. 
 
భక్తులు ఇచ్చిన డబ్బును బస్తాల్లో వేసిన సుధాకర్ ఇటీవల అర్ధరాత్రి ఓ చోటుకి తరలించాలని చూశాడు. ఆ క్రమంలో ఆయన వద్ద పనిచేసే నలుగురు సిబ్బంది ఆ డబ్బంతా తీసుకుని పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆయన ఆశ్రమం వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో సుధాకర్ పురుగుల  మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫలితంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.