మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (15:28 IST)

మీడియా పేరుతో బెదిరింపులు.. సీసీ కెమెరాతో చిక్కుకున్నారు..

మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ఉ

మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ''కమిలి'' వార్తా పత్రిక రిపోర్టర్ కృష్ణారావు బెదిరింపులకు దిగాడు. 
 
విలేకరి ఆటకట్టించాలనే ఉద్దేశంతో యువకులు ఆయనను చర్చకు పిలిచారు. గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆపై వారితో మాట్లాడేందుకు పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, విలేకరులు అప్పికొండ ప్రసాద్‌, దేవవరపు నరేష్ బాబు వచ్చారు.
 
సౌజన్య వారితో చర్చిస్తూ, ఆన్‌‌లైన్‌ ట్రేడింగ్‌‌ చేయాలంటే భారీగా జీఎస్టీ కట్టాల్సి వస్తుందని, విషయమంతా తమ పత్రికలో రాస్తే, కోటి రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సి వుంటుందని, తమకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే చివరికి రూ.20లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఈ వీడియోను పోలీసులకు ఆ యువకులు సమర్పించి.. ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.