శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (12:50 IST)

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

Ali
Ali
కమెడియన్ అలీ ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించట్లేదు. మిత్రుడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పక్కనబెట్టి వైకాపాలో చేరిన అలీకి ఆశించిన పదవి దక్కలేదు. దీంతో ఎన్నికల ప్రచారానికి అలీ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో 2024 ఎన్నికలలో అలీ పోటీ షూర్ అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెరమీదకు వచ్చింది. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాకా చూస్తే అలీకి మళ్లీ నిరాశ తప్పలేదు. దీంతో అలీ రాజకీయ వ్యవహారాలకు దూరంగా వున్నాడు. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు. 
 
ఈ మధ్యే ఓ టీవీ చానల్ లో ఆయన నిర్వహించే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు. ఒక వేళ పోయినా ఎన్నికలలో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. దీంతో అలీ ప్రచారానికి దూరంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.