1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (09:52 IST)

రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి ఉత్తర,దక్షిణ భారత యాత్రలు

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి ఉత్తర, దక్షిణ భారత యాత్రలను నిర్వహిస్తోంది. ఉత్తర భారత యాత్ర: రేణిగుంటలో ఏప్రిల్‌ 24న ఉదయం బయలు దేరి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, ఖాజీపేట, రామగుండం రైల్వేస్టేషన్లలో ఆగి పర్యాటకులను ఎక్కించుకుంటారు. అక్కడ నుంచి బయలు దేరి 26న ఉదయానికి ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను దర్శించుకుంటారు.

తదనంతరం మధురకు చేరుకుని కృష్ణజన్మభూమిని చూస్తారు. అక్కడనుంచి జమ్ము-కశ్మీర్‌లోని కట్రాచేరుకుంటారు. 28న ఉదయం వైష్ణవిదేవి ఆలయాన్ని దర్శించుకుని ఇతర ఆలయాలను స్వంత ఖర్చులతో చూస్తారు. కట్రాలో బయలు దేరి జలంధర్‌, అమృతసర్‌, గోల్డన్‌టెంపుల్‌, వాగా బార్డర్‌లను దర్శిస్తారు.

30న ఉదయం హరిద్వార్‌ చేరుకుని అక్కడ మానసదేవి మందిర్‌, గంగాహారతి చూసుకుని ఒకటన డిల్లీ చేరుకుంటారు. అదేరోజు, మరుసటి రోజు డిల్లీలో ఎర్రకోట, రాజ్‌ఘాట్‌, ఇందిరామెమోరియల్‌, అక్షరధామం,కుతుబ్‌మీనార్‌, ఇందిరాఘాట్‌,అనంతరం అదేరాత్రి బయలు దేరి తిరుగు ప్రయాణం చేస్తూ 4న రాత్రికి రేణిగుంటకు చేరుకుంటారు. ఈ యాత్రకు స్లీపర్‌ క్లాస్‌ ధర రూ 10,400లు, థర్డ్‌ఏసీ ధర రూ 13,330
 
దక్షిణభారత యాత్ర :ఈ యాత్ర మే 11వ తేదీ ఉదయం సికింద్రాబాద్‌లో బయలు దేరి వరంగల్‌, ఖమ్మం, విజయవాడ,తెనాలి,ఒంగోలు ,నెల్లూరు, గూడూరు మీదుగా రేణిగుంటకు అదేరాత్రి చేరుకుంటుంది. ఇక్కడ పర్యాటకులను ఎక్కించుకుని 12న ఉదయానికి తిరుచానాపల్లి చేరుకుని ఆలయాలు దర్శించుకుంటారు.

13న రామేశ్వరం చేరుకుంటారు. 22 బావుల తీర్థాలు, సముద్రతీరం, తిలకించి మధురైకి చేరుకుంటారు. అక్కడ మధురమీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. 14న ఉదయం నాగూర్‌కోయిల్‌ చేరుకుని అక్కడనుంచి కన్యాకుమారి అమ్మాల్‌గుడి, వివేకానందరాక్‌లను దర్శించుకుంటారు.

15న నాగూర్‌కోయిల్‌లో బయలు దేరి చెంగల్‌పట్టు చేరుకుంటారు. 16న మహాబలిపురం ,కంచికామాక్షమ్మ ఆలయాలను దర్శించుకుంటారు. 17న ఉదయం బయలు దేరి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి సికింద్రాబాద్‌ చేరుకుంటారు.

ఈ యాత్రలో సీపర్‌ క్లాస్‌కు రూ 6,620లు, థర్డ్‌ ఏసీ రూ 11,030లుగా టిక్కెట్‌ ధరలు నిర్ణయించారు. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకు పెద్దల చార్జీనే వర్తిస్తుంది. పూర్తి వివరాలకు 8287932313, 8287932317,7670908221 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.