శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (12:08 IST)

రఘురామను కుటుంబ సభ్యులు కలిసేందుకు ప్రయత్నం.. అనుమతివ్వని అధికారులు...

రాజద్రోహం కేసులో అరెస్టు అయిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యూడీషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఆయనకు పరీక్షలను నిర్వహిస్తోంది. 
 
రఘురాజును చూసేందుకు వస్తున్న ఎవరినీ ఆసుపత్రిలోకి అధికారులు అనుమతించడం లేదు. ఆయన కుటుంబసభ్యులను కూడా లోపలకు రానివ్వలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురాజు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎవరైనా కలవాలనుకుంటే... చట్ట ప్రకారం అది ములాఖత్ కిందకు వస్తుంది.
 
అంటే... సదరు వ్యక్తిని కలవాలంటే చట్ట ప్రకారం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అధికారులు కూడా అదే చెపుతున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు కూడా కలవడానికి కుదరదని వారు స్పష్టంచేశారు. కోర్టు అనుమతి ఉంటేనే కలుసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.