శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2020 (19:04 IST)

ఓ ప్రభువా, ఎస్పీ బాలసుబ్రమణ్యంను కాపాడు: కె.ఎ పాల్

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఆరోగ్యం బాగాలేదని నాకు చెప్పారు. నన్ను ప్రార్థన చేయమన్నారు. ఓ ప్రభువా ఎస్పీ బాలసుబ్రమణ్యంను కాపాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా ఆశీస్సులు ఇంతకుముందే తీసుకున్నారు. వయస్సులో పెద్ద వారైనా ఆయన నాకు శిష్యుడు.
 
నేనంటే ఎస్పీ బాలుసుబ్రమణ్యంకు ఎంతో అభిమానం. నా దగ్గరకు ఎన్నోసార్లు వచ్చి నా ఆశీస్సులు అందుకున్నారు. అలాంటి ఆయన త్వరగా కోలుకోవాలి.. ఆయన్ను కాపాడు ప్రభువా అంటూ ప్రార్థన చేశారు కె.ఎ.పాల్.
 
అంతేకాదు ఒకవేళ ఆయన్ను బతికించకపోతే నీ దగ్గరకు తీసుకెళ్ళు అంటూ చెప్పాడు కె.ఎ. పాల్. నిన్న ప్రార్థన చేసి ఒక వీడియోను పంపిస్తే ఈ రోజు ఉదయానికి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోలుకున్నదట. అది కూడా గతంలో కన్నా మెరుగ్గానే వున్నారట. 
 
ఈ విషయాన్ని వైద్యులే స్పష్టం చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు కె.ఎ.పాల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ సందేశాలను పంపిస్తున్నారట. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది.