శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:22 IST)

మీకు ఆన్ లైన్లో గిఫ్ట్ వచ్చింది... కారు కావాలా? క్యాష్ కావాలా?

ఆన్ లైన్ మోసాల‌కు అంతే లేకుండా పోతోంది... మీకు విలువైన బ‌హుమ‌తి వ‌చ్చింద‌ని కాల్ చేసి, ఓ మ‌హిళకు కుచ్చుటోపీ పెట్టారు. మ‌రొక‌రి నుంచి ఆర్ లైన్ ట్రేడింగ్ పేరుతో మ‌రో నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కు గుంజారు. ఇదంతా చేస్తోంద‌ని నైజీరియ‌న్ల‌ని సైబ‌ర్ పోలీసులు క‌నిపెట్టారు. ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు.

హైద‌రాబాదులో ఇలా 37 లక్షల రూపాయలు మోసం చేసినట్లు, సైబర్ చీటర్స్ పై ఫిర్యాదులు అందాయి. ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి వీరు 3.7 లక్షల మోసం చేసి లాగేశారు. దీనితో వారిద్ద‌రూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

ఇక ఒక మ‌హిళ‌కు ఖ‌రీదైన గిఫ్ట్ వ‌చ్చింద‌ని, దీనికి కొంత పే చేయాల‌ని, ల‌క్కీ డిప్ పేరుతో ఓ మహిళ నుండి 16 లక్షల మోసం చేసి, ఆన్ లైన్ లో లాగేశారు. ఈ కేసులో ఒక నైజీరియన్ ని పోలీసులు అరెస్ట్ చే శారు. హైదరాబాద్ బోయిన్ పల్లి కి ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్ వచ్చింది. అందుకు గాను వివిధ చార్జీల పేరుతో 16 లక్షలు క‌ట్టాల‌ని వెంట‌ప‌డి మ‌రీ డ‌బ్బు క‌ట్టించుకున్నారు. తీరా ఆ ఖ‌రీదైన బ‌హుమ‌తి ఎంత‌కీ రాక‌పోవ‌డంతో ఆ మ‌హిళ త‌ను మోసపోయిన విష‌యాన్ని గ్ర‌హించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయ‌గా, ఈ కేసులో ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. ఈమె లాటరీలో విలువైన కారు గెలుపొందారని 17.35 లక్షల మోసం చేశారు.

హైదరాబాద్ గోల్కొండకు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేశారు సైబర్ చీటర్స్. మీకు కార్ కావాలా, క్యాష్ కావాలా అని చీటర్స్ అడ‌గ‌డంతో, నగదు కావాలని అడిగాడు బాధితుడు. ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని. ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేశారు. ఇలాంటి సైబ‌ర్ ఛీట‌ర్స్ నుంచి త‌స్మాత్ జాగ్ర‌త్త అంటున్నారు... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.