శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:41 IST)

కిరాతక తండ్రి-రెండోసారీ ఆడశిశువు పుట్టిందని.. తొట్టెలో పడేసి చంపేశాడు..

ఆధునికత పెరిగినా.. ఆడశిశువులపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఉన్నత విద్యలు చదువుకున్నా.. ఆడశిశువులపై కొందరు చిన్నచూపు చూస్తూనే వున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీదేవీ పుట్టిందని భావిస్తారు. కానీ మరికొందరు ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పుట్టి నెలరోజులే అయిన ఆడ శిశువును తండ్రి హతమార్చాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందనే కర్కశంతో నీటి తొట్టెలో పడేసి ప్రాణాలు తీసేశాడు. 
 
తొలి కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టగా, రెండో బిడ్డ కూడా ఆడశిశువే జన్మించడంతో అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.