గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (10:47 IST)

ఆచ్... తూచ్.. 'ముందస్తు జమిలి'కి సిద్ధమని డాడీ చెప్పలేదు : నారా లోకేష్

ముందస్తు జమిలిపై రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట మార్చారు. తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పలేదని వివరణ ఇచ్చారు.

ముందస్తు జమిలిపై రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట మార్చారు. తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పలేదని వివరణ ఇచ్చారు. 
 
వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో లోకేశ్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ఈ సమయంలో 'జమిలి ఎన్నికల' ప్రస్తావన వచ్చింది. ముందస్తుకు సిద్ధమవుతున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం నిర్ధారించలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పారు' అని అన్నారు. 
 
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 'రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్న టీడీపీకాక ఇంకెవరు గెలుస్తారు? మూడేళ్లలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగింది. వచ్చే ఏడాదిలో మరింత చేసి చూపిస్తాం. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తాం' అని లోకేష్ చెప్పుకొచ్చారు