బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (10:49 IST)

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్.. పరుగులు పెట్టిన జనం

Konaseema
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
 
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. 
 
మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ లీక్‌పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.