సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (11:43 IST)

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

road accident
కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గూడ్స్ ఆటో, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి పాలకొల్లు వెళుతున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
   
ఈ ప్రమాదంలో గూడ్స్ ఆటోలో ముగ్గురు, కారులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.