బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్.. మంత్రి పువ్వాడ
బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమకు కేటీఆర్ ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఎవరున్నారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడారు.
కేసీఆర్ పాలనలో కేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో సాగుతోందని ప్రశ్నించారు. కేటీఆర్ పాలన వల్లే మున్సిపల్ పాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఓవైపు పార్టీ పనులను చూసుకుంటూనే.. మరోవైపు కేటీఆర్ ప్రభుత్వ పాలనలో కీలక శాఖలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. శనివారం వరంగల్‌లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.