ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (20:10 IST)

వివాదంలో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

brslogo
ఆదిలాబాద్ జిల్లా బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఇచ్చోడ మండలం నవ్‌గామ్ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాథోర్ బాపురావు హెచ్చరించారు. 
 
పంచాయతీ సెక్రటరీ సురేష్‌కు ఫోన్ చేసి భార్యాపిల్లలను బతికించుకుంటావా లేదా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే.. ఉద్యోగం ఊడిపోతుందని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. అయితే తన తప్పేంటో తెలుసుకున్న ఎమ్మెల్యే క్షమాపణలు కోరారు.