బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (10:56 IST)

బీఆర్ఎస్ సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేసిన యువకుడు.. ఎక్కడ?

Sarpanch
Sarpanch
మహబూబాబాద్ జిల్లా, మోట్ల తండాలో గ్రామ సమావేశంలో అభివృద్ధి-మౌలిక సదుపాయాలపై వాడివేడి చర్చ జరుగుతుండగా, దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. అభివృద్ధి ముసుగులో నిధుల వినియోగంపై సర్పంచ్ బానోత్ సుమన్ నాయక్ మహేష్‌ను ప్రశ్నించారు. 
 
కోపోద్రిక్తులైన మహేష్, సర్పంచ్ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు చెప్పుతో సర్పంచ్‌పై దాడి చేశాడు. 
 
సర్పంచ్ సుమన్ నాయక్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, సర్పంచ్‌గా పనిచేసి సానుకూల మార్పు తీసుకురావడానికి తాను నిజాయితీగా కృషి చేస్తున్నప్పటికీ ఇలాంటి హింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.