గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (16:05 IST)

వృద్ధురాలిని చంపి మాంసం ఆరగించిన యువకుడు..

crime
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. వృద్ధురాలిని చంపిన ఓ యువకుడు.. చివరకు ఆమె మాంసాన్నే ఆరగించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాలి జిల్లాలో సారధన గ్రామంలో శుక్రవారం శాంతిదేవి(65) అనే మహిళ పశువులను మేపుతుండగా సురేంద్ర ఠాకూర్‌ అనే వ్యక్తి రాయితో దాడి చేసి హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత నరరూప రాక్షుడు ఆమె మాంసాన్ని భక్షించాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడికి పిచ్చిపట్టినట్టు స్థానికుల సమాచారం. ఈ ఘటన తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, ఆ యువకుడికి హైడ్రోఫోబియా అనే వ్యాధి (కుక్కకాటు వల్ల వచ్చే జబ్బు)తో బాధపడుతున్నట్టు తేల్చారు. గతంలో రేబిస్ వ్యాధి వచ్చివుంటుందని, దానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే ఈ వ్యాధి బారినపడివుంటాడని వైద్యులు చెబుతున్నారు.