శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (13:09 IST)

భార్యాపిల్లలను బతికించుకుంటావా లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు

brslogo
ఆదిలాబాద్ జిల్లాలోని భోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వివాదంలో చిక్కుకున్నారు. ఓ విషయంలో ఇచ్చోడ మండలం నవ్‌గామ్ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌ను హెచ్చరించారు. పంచాయతీ సెక్రటరీ సురేశ్‌కు ఫోన్ చేసి భార్యాపిల్లలను బతికించుకుంటావా? లేదా చెప్పాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఉద్యోగం పోతే తెలుస్తుందని, మంచి మాటతో చెప్తున్నా.. పద్దతి మార్చుకోవాలంటూ భయపెట్టాడు. పైగా ఎక్కువ మాట్లాడుతున్నావని, సర్పంచ్‌లతో కలిసి తప్పులు చేస్తున్నావని సెక్రటరినీ భయభ్రాంతులకు గురిచేశారు. 
 
అయితే, తన తప్పేంటో చెప్పాలని ఎమ్మెల్యేలను సెక్రటరీ ప్రాధేయపడ్డారు. తప్పంటే రాజీనామా చేస్తానని తెలిపారు. అయిన సెక్రటరీ మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే, పద్దతి మారకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమను నమ్మించి మోసం చేశావంటూ ఆరిజిన్ పాల సంస్థ భాగస్వామి శేజర్ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకుని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని వాపోయారు.