గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (11:20 IST)

ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్లు అత్యాచారం.. ఎక్కడ?

victim
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్ బాలుర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. 
 
జిల్లాలోని జానకీపురం సమీపంలో ఓ చిన్నారి రెండో తరగతి చదువుతుంది. ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండే చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. దీంతో ఏం జరిగిందని చిన్నారి వద్ద క్లాస్ టీచర్ ఆరా తీసింది. ఆ బాలిక మాటలను బట్టి ఆ చిన్నారి లైంగిక దాడికి గురైనట్టు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె జిల్లా బాలల భద్రతా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న బాలల సంక్షేమ విభాగం అధికారులు ఆ బాలిక వద్ద ఆరా తీయగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన 14 నుంచి 17 యేళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ ఒక్క బాలికనే కాకుండా మరో నలుగురు బాలికలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని జునైల్ హోంకు తరలించారు.