గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:35 IST)

అలెర్ట్.. క్రికెట్ బాల్ సైజులో వడగండ్ల వర్షం..

hailstorm
hailstorm
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో కొన్ని చోట్ల క్రికెట్ బంతుల సైజులో వడగళ్లు పడే అవకాశం వుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. 
 
ప్రజలు అప్రమత్తంగా వుండాలని స్పష్టం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదరుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడతాయని వివరించింది.