శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (09:58 IST)

ఈ నెల 9 వరకు రైళ్ల రద్దు : విజయవాడ రైల్వే అధికారులు

train
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన మేరకు.. నంబరు 22831 హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైలును ఈ నెల 7వ తేదీన రద్దు చేశారు. 
 
అలాగే, 12839 హౌరా -  న్నై సెంట్రల్‌ రైలును ఈ నెల 7, 22842 తాంబరం - సంత్రాగచ్చి రైలును ఈ నెల 7న, 22503 కన్యాకుమారి - డిబ్రూఘర్ రైలును 7న, బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22888 బెంగళూరు - హౌరా రైలును 8వ తేదీన, 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా రైలును 9వ తేదీన, 18048 వాస్కోడిగామ - షాలిమార్‌ రైలును 9వ తేదీన, 12503 బెంగళూరు - అగర్తలా రైలును 9వ తేదీన రద్దు చేశారు.