బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (16:29 IST)

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఉచితంగా చదివిస్తా-సెహ్వాగ్

sehwag
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 290మందికిపైగా ప్రయాణికులు మరణించారు. ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. 
 
రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన విద్యార్థులకు విద్యనందించేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. ఈ విషాధ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తాను చేయగలిగేదని ట్వీట్ చేశారు. 
 
ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్యను అందిస్తాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.