బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (04:17 IST)

ప్రమాదంలో చిక్కుకుని మరణంచేవరకు నరకయాతన పడ్డ నిర్భాగ్యుడు

మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది.

మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది. పోలీసుల కథనం మేరకు నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్  అనే యువకుడు గురువారం రాత్రి బ్రాహ్మణ చెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును  మోటారా సైకిలుతో ఢీకొట్టాడు.
 
ఆ యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. 30 ఏళ్ల వయస్సు. కొద్ది రోజుల క్రితమే  విదేశాలనుంచి దేశానికి తిరిగి వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే రాత్రి పూట ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాల పాలై స్పృహ తప్బిన గణేష్‌ను ఎవరూ గమనించలేక పోయారు. దీంతో గాయాలతో బాధపడి బాధపడి తెల్లారేసరికి ఘటనా స్థలంలో మృతి చెందాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చి అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో దిక్కులేని చావు పొందిన గణేష్‌ను చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.