ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర - భద్రత కట్టుదిట్టం
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు భారీ ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇమ్రాన్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు వెలుగు చూసిన కొని క్షణాల్లోనే భద్రతా బలగాలు స్పందించారు. ఇస్లామాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామని, ప్రజలు గుమికూడటాన్ని నిషేధించినట్టు స్థానిక పోలీస్ ఒకరు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని బలిగాలాలో ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పర్యటించనున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఎటువంటి హానీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. కాగా, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే.