1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (14:29 IST)

ఆడపిల్లల్ని వేధిస్తే నేనూ అలాగే రియాక్ట్ అవుతా.. నగేష్ వీడియోపై పరిటాల శ్రీరామ్

ఓ పీజీ విద్యార్థిని ఓబులేష్ అనే రౌడీషీటర్ వేధించిన ఘటనలో అతడిని నగేష్ చౌదరి అనే వ్యక్తి దారుణంగా చితబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్యూస్ ఛానళ్లలో బాగా పాపులర్ కూడా అ

ఓ పీజీ విద్యార్థిని ఓబులేష్ అనే రౌడీషీటర్ వేధించిన ఘటనలో అతడిని నగేష్ చౌదరి అనే వ్యక్తి దారుణంగా చితబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్యూస్ ఛానళ్లలో బాగా పాపులర్ కూడా అయ్యింది. నగేష్ అనే వ్యక్తి సదరు విద్యార్థినిని వివాహమాడనున్నాడని.. నగేష్ ఎవరో కాదు.. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కారు డ్రైవర్ అని ప్రచారం జరిగింది. పరిటాల శ్రీరామ్ అండతోనే ఈ విధంగా నగేష్ చౌదరి రెచ్చిపోయాడనే విమర్శలు కూడా వచ్చాయి. 
 
దీనిపై పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, నగేష్ చౌదరి వెనక తామున్నామనే విషయం ముఖ్యం కాదన్నారు. అందరిలాగే తామూ చట్టాన్ని గౌరవిస్తాం. చట్టాన్ని గౌరవించవద్దంటూ క్లాసులు పెట్టి చెప్పట్లేదు. ఈ ఘటనలో నగేష్ రియాక్ట్ అయి పద్ధతి కరెక్ట్ కాదని తాను చెప్పనని శ్రీరామ్ అన్నారు. 
 
కానీ ఎంత బాధ ఉంటే.. ఆ అమ్మాయిని ఎంతగా వేధించి వుంటే నగేష్ అలా రియాక్ట్ అయి వుంటాడో ఆలోచించాలి. తన ఇంట్లోని ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే తాను కూడా అలాగే రియాక్ట్ అవుతానని తెలిపారు. అది క్షణికావేశం కావొచ్చు ఏదైనా కావొచ్చునని తెలిపారు. మహిళా సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికీ ముందుంటానని, పోలీసులు, మహిళా సంఘాల సహాయంతో ఆ సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు.