శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (21:25 IST)

ఇప్పటం గ్రామ పంచాయతీకి పవన్ కళ్యాణ్ విరాళం రూ.50 లక్షలు

జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సంపూర్ణ సహకారాలు అందించిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటించారు. 
 
"కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీర మహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు మందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరపున రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. 
 
అలాగే, సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చేసిన పోలీసులకు అధికారులకు నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్ళకు, తోటి 'భీమ్లా నాయక్‌'లైన మా ఎస్ఐలకు, మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ప్రకటించారు.