శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (21:07 IST)

ప‌వ‌న్ దీక్ష‌కు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష‌లు...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు కాబట్టే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.
 
ఉద్ధానం కిడ్నీ బాధితులకి సర్కార్ నుంచి మెరుగైన వైద్య సేవలు అందేవరకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ ఆశించకుండా మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్‌ ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని సంకల్పించుకున్నారని మాదాసు గంగాధరం తెలిపారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు సంఘీభావ దీక్ష చేస్తాయన్నారు. మ‌రి... ఈ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.