శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:49 IST)

ఉద్దాన ప్రజల కిడ్నీ సమస్యకు తాగునీరు కారణం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యలకు తాగునీరు ప్రధాన కారణం కాదని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దక్షిణ భారత విభాగం ప్రాంతీయ కార్యాలయం (హైదరాబాద్‌) అదనపు డైర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యలకు తాగునీరు ప్రధాన కారణం కాదని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దక్షిణ భారత విభాగం ప్రాంతీయ కార్యాలయం (హైదరాబాద్‌) అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎం. శ్రీధర్‌ అంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాగునీటి కారణంగానే ఉద్దానంలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తమ విభాగం జరిపిన పరిశోధనలో అక్కడి నీటిలో ఎలాంటి ఘనపదార్థాలు ప్రమాదకర స్థాయిని తెలిపే గణంకాలు నమోదుకాలేదని వివరించారు. 
 
అయితే, కిడ్నీ రోగులకు తాగునీరు అధికంగా అవసరం కాబట్టి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. అదేసమయంలో ఈ సమస్యకు గల కారణాలను కనుగొనేందుకు తమ బృందం అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు తాము జరిపిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను ఓ నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. 
 
కాగా, ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వినతి మేరకు.. హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రత్యేక వైద్యబృందం ఉద్దానంలో పర్యటించి అధ్యయనం చేసిన విషయం తెల్సిందే.